'వాల్తేరు వీరయ్య' ప్రచార చిత్రాలు వింటేజ్ చిరంజీవిని గుర్తు చేశాయి. దానికి తోడు రవితేజ రోల్. మరి, సినిమా ఎలా ఉంది?

కథ : మలేషియాలోని సాల్మన్ (బాబీ సింహా)ను తీసుకు వస్తే 25 లక్షలు ఇస్తానని  ఓ పోలీస్ ఆఫర్ చేస్తాడు. 

మలేషియా వెళ్ళిన వీరయ్య... తాను సాల్మన్ కోసం కాదని, అతని అన్న మైఖేల్ (ప్రకాష్ రాజ్) కోసం వచ్చానని చెబుతాడు.

మైఖేల్, వీరయ్య మధ్య ఏం జరిగింది? జాలరిపేటకు, డ్రగ్ డీలర్లకు సంబంధం ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.

ఎలా ఉంది? : వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేసేలా, ఫ్యాన్స్ కోరుకునేలా చిరును చూపించడంపై దర్శకుడు దృష్టి పెట్టారు.

'వాల్తేరు వీరయ్య' కథ రొటీనే. ఫస్టాఫ్ ఫాస్టుగా వెళుతుంది. సెకండాఫ్ స్లోగా ఉంది. ఎమోషన్ సరిగా వర్కవుట్ కాలేదు. 

సినిమాలో క్యారెక్టర్లు, చిరు & రవితేజ మధ్య బాండింగ్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. చేసుంటే సినిమా మరోలా ఉండేది. 

చిరు, శృతి ట్రాక్ బాగా రాశారు. పాటల్లో డ్యాన్స్ బావుంది. ఫైటుల్లో చిరు మాస్ మెస్మరైజ్ చేస్తుంది.  

దేవిశ్రీ పాటలు స్క్రీన్ మీద మరింత బావున్నాయి. నేపథ్య సంగీతం సూపర్. కెమెరా వర్క్ కూడా బావుంది.

'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయాయి. చిరు, రవితేజ కాంబో స్పెషల్ అట్రాక్షన్. 

ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే 'వాల్తేరు వీరయ్య'ను ఎంజాయ్ చేసి రావచ్చు.