'వీర సింహా రెడ్డి'లో డైలాగ్స్ బావున్నాయని పేరు వచ్చింది. ఏపీ ప్రభుతాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగ్స్ వేశారు. అవేంటి?

ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు. గౌరవించడం మన బాధ్యత - బాలకృష్ణ

సెంట్రల్ అయినా, స్టేట్ అయినా రాజకీయాల మీద బతికే మనిషిని కాదు... రాజకీయాల్ని మార్చే మనిషిని!

నువ్వు సవాలు విసరకు... నేను శవాలు విసురుతా - బాలకృష్ణ 

ఊరి కన్నీళ్ళు నేను మోస్తున్నాను, నా కన్నీళ్లు నువ్వు మోస్తున్నావు - హానీ రోజ్‌తో బాలకృష్ణ

ప్రజల్ని వేధించడం, జీతాలు బిచ్చం వేయడం, పనులు ఆపడం,ఉన్న పరిశ్రమలు మూయడం అభివృద్ధి కాదు!

నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు... మారిపోవాలి, పారిపోవాలి లేదంటే సచ్చిపోవాలి - బాలకృష్ణ

అన్నం మీద గౌరవం లేని వాడు ఆకలికి పనికిరాడు.. అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికి రాడు.

కోసేవాడికి కోడిమీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా.

సమాధానం చెప్పలేని వాడికి  ప్రశ్నించే హక్కు లేదు.

సీత దూరమైనా రాముడు రాజే, మనిషి రూపంలో సంస్కారం మాట్లాడుతున్నట్టు ఉంది - బాలకృష్ణ గురించి క్యారెక్టర్స్