బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ ఫ్యాక్షన్ ఫిల్మ్ 'వీర సింహా రెడ్డి'. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ : రాయలసీమలో శక్తివంతమైన ఫ్యాక్షన్ లీడర్ వీర సింహా రెడ్డి (బాలకృష్ణ). తన కొడుకు జై పెళ్ళి కోసం ఇస్తాంబుల్ వెళతాడు.

వీర ప్రత్యర్థి ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్), అతడి భార్య భాను (వరలక్ష్మి) కూడా ఇస్తాంబుల్ వెళతారు.

విదేశాల్లో తన అన్న వీర మర్డర్ ప్లాన్ చేస్తుంది భాను. ఎందుకు? ఆమె ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా?

జై, అతడి తల్లి మీనాక్షి (హానీ రోజ్)కు వీర ఎందుకు దూరంగా ఉన్నాడు? తండ్రి గతం తెలిసిన జై ఏం చేశాడు?

ఎలా ఉంది? : నందమూరి ఫ్యాన్స్, ఫ్యాక్షన్ బేస్డ్ యాక్షన్ సినిమాలు మెచ్చే ప్రేక్షకుల కోసమే 'వీర సింహా రెడ్డి'.

ఫస్ట్ 20 నిమిషాలు బోర్. శృతితో బాలయ్య సీన్స్ ఏవీ ఆకట్టుకోవు. వీర సింహా రెడ్డి రోల్ ఎంట్రీతో ఇంట్రెస్ట్ మొదలవుతుంది. 

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. ఫైట్స్, డ్యాన్సులు బాగా చేశారు.

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ గెటప్, ఆ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ మిగతా అంశాలపై దర్శకుడు పెట్టలేదు.

ఫ్యాక్షన్ కథకు సిస్టర్ విలనిజం, సెంటిమెంట్ యాడ్ చేసి 'వీర సింహా రెడ్డి' తీశారు. అది కొంతే వర్కవుట్ అయ్యింది.

ఫైట్స్, యాక్షన్ బావున్నాయి. తమన్ ఆర్ఆర్ హీరోయిజం ఎలివేట్ చేసింది. సాంగ్స్ కమర్షియల్ వేలో ఉన్నాయి. 

నందమూరి అభిమానులను 'వీర సింహా రెడ్డి' శాటిస్‌ఫై చేస్తుంది. యాక్షన్ సీన్స్ ఎక్కువైనా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు.