సంక్రాంతికి విడుదలయ్యే తెలుగు సినిమాల థియేటర్స్ లిస్టు విజయ్ 'వారసుడు' చుట్టూ తిరుగుతోంది. 'వారసుడు' కోసం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'కి 'దిల్' రాజు థియేటర్లు ఇవ్వడం లేదని విమర్శ ఉంది. అసలు, తెలుగులో 'వారసుడు' ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే... నైజాం ఏరియాలో 'వారసుడు'కు రూ. 6 కోట్లు లెక్క కట్టారు. సీడెడ్ (రాయలసీమ) ఏరియాలో సినిమాను రూ. 2 కోట్లకు అమ్మారు. ఆంధ్రలో రూ. 8 కోట్ల రేషియో లెక్కన ఏరియాల వారీగా 'దిల్' రాజు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో 'వారసుడు'కు రూ. 16 కోట్ల బిజినెస్ జరిగింది. థియేటర్స్ నుంచి రూ. 17 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్. నైజాం, విశాఖ ఏరియాల్లో 'దిల్' రాజు సొంతంగా విడుదల చేస్తున్నారు. అయినా సరే డిస్ట్రిబ్యూషన్ లెక్క లెక్కే. తెలుగులో ఈ మధ్య విజయ్ మార్కెట్ పెరిగింది. అయితే, అన్ని కోట్లు వస్తాయా? లేదా? అనేది చూడాలి. సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు లేకపోతే 17 కోట్లు రావడం ఈజీనే. కానీ, పరిస్థితి అలా లేదు.