బాలీవుడ్ భామ తారా సుతారియా తన ‘అపూర్వ’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తన స్టైలింగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. తెల్ల దుస్తుల్లో ఆకట్టుకునేలా ఉంది. తక్కువ మేకప్‌తోనే తను తయారై వచ్చింది. హీల్స్ కూడా మరీ పెద్దవి వేసుకోలేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో తారా సుతారియా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు తారా ఐదు సినిమాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు టీవీ రియాలిటీ షోల్లో కనిపించేది. మసక్కలి రీమిక్స్ మసక్కలి 2.0లో నటించినందుకు విమర్శల పాలైంది.