సినిమాల్లోకి వచ్చి తమన్నా ఎంత సంపాదించిందో తెలుసా? మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. విజయ్ వర్మతో డేటింగ్ చేస్తూ వార్తల్లోకెక్కింది. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యింది. నటిగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ముంబైలో ఇటీవల రూ.16 కోట్లతో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఒక్కో మూవీకి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ కు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు అందుకుంటోంది. ఎండార్స్ మెంట్స్ ద్వారా ఏడాది రూ. 12 కోట్లు సంపాదిస్తోంది. ఇప్పటి వరకు తమన్నా రూ. 110 కోట్లకు పైనే ఆస్తులు పోగేసిందట. Photos Credit: Tamannaah Bhatia/Instagram