పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ స్టయిలే వేరు. సింహ గర్జనే. 'వీర సింహా రెడ్డి'లో ఆయన డైలాగ్స్ చూశారా?

పదవి చూసుకుని నీకు పొగరు ఏమో? బై బర్త్ నా డీఎన్ఏకి పొగరు ఎక్కువ - బాలకృష్ణ   

సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో!? కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు!

ఫారినర్ : నువ్వు ఎవరు?
బాలకృష్ణ : పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికి అయినా వెళ్ళి నిలబడు. నీకో స్లోగన్ వినిపిస్తుంది.

అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను. ఒంటి చేత్తో ఊచకోత... కోస్తా!

సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేను ఒక్కడినే కత్తి పట్టా... పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు!

నాది ఫ్యాక్షన్ కాదు... సీమ మీద ఎఫెక్షన్!

వీర సింహా రెడ్డి... పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్!

పగోడు పంపుతున్న పసుపు కుంకాలతో బతుకుతుంటే ముత్తైదువులా లేను, ముండ మోపిలా ఉన్నా - వరలక్ష్మీ శరత్ కుమార్  

'మైలురాయికి మీసం మొలిచినట్టు ఉండాదిరా' - బాలకృష్ణ వీరత్వం గురించి అజయ్ ఘోష్ డైలాగ్