'బిగ్ బాస్ సీజన్ 5' విన్నర్ గా టైటిల్ కొట్టి సెన్సేషన్ సృష్టించాడు వీజే సన్నీ. 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చిన తర్వాత సన్నీ వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం‘అన్‌స్టాపబుల్ - అన్‌లిమిటెడ్ ఫన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీజే సన్నీ. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సన్నీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తన ఫోకస్ అంతా లక్ష్యంపైనే అంటూ టార్గెట్ ను గురిపెట్టాడు. ఇక ఇటీవలే ‘సౌండ్ పార్టీ’ అనే పేరుతో సినిమాను ప్రకటించిన వీజే సన్నీ. ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరిగింది. Image Credits : VJ Sunny/Instagram