వివో వై77 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. వై-సిరీస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ ఇదే. 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,600) నిర్ణయించారు. బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.