మేషం పని వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజు మళ్లీ ప్రారంభమవుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది.
వృషభం ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. తలనొప్పి తో ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు.
మిథునం ఈ రోజు మంచి రోజు అవుతుంది. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. వాహనాన్ని నెమ్మదిగా నడపండి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు. చిన్న విషయానికి కోపం తెచ్చుకోవద్దు.
కర్కాటకం వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నేహితులు మీ సహాయాన్ని ఆశిస్తారు. పై అధికారుల నుంచి ప్రయోజనం పొందుతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీ సంపద పెరుగుతుంది.
సింహం మీ నైపుణ్యం మరింత పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి మంచి సమయం ఇది. ఈ రోజు మీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో అత్యవసర విషయాలను చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పులు తీసుకోవద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
కన్యా అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. శ్రమకు తగిన ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతుంది. బ్యాంకింగ్‌కు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. మీరు కుటుంబంతో సమయం గడుపుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు రావొచ్చు. దంపతులు సంతోషంగా ఉంటారు.
తులా ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. గత పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం వ్యవహారంలో లాభపడతారు. ఓ పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రిస్క్ తీసుకోవద్దు. ఆలోచించి అడుగేయండి.
వృశ్చికం ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయొద్దు. విదేశాల నుంచి మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.
ధనుస్సు మీరు తెలియని వ్యక్తి నుంచి సహాయం పొందే అవకాశం ఉంది. ఈ రోజంతా బద్దకంగా ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. బంధువుల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం రోజు ఆరంభం చాలా బావుంటుంది. ఆర్థికంగా లాభపడతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. కార్యాలయంలో లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
కుంభం ఈ రోజు చాలా క్రమశిక్షణతో కూడిన రోజు అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. పాత మిత్రులను కలుస్తారు. కార్యాలయంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. రాజకీయ నాయకులు లాభపడతారు.
మీనం రిస్క్ తీసుకోవద్దు. డ్రైవింగ్‌లో ఇబ్బంది ఉండొచ్చు. చట్టపరమైన వివాదాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. వ్యాపార పరిస్థితులు బావుంటాయి. ఎలక్ట్రికల్ పరికరాలను జాగ్రత్తగా వాడండి. రహస్య విషయాలను అధ్యయనం చేయగలరు.