అసుస్ రోగ్ ఫోన్ సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో అసుస్ రోగ్ ఫోన్ 6, అసుస్ రోగ్ ఫోన్ 6 ప్రో ఫోన్లు ఉన్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 6 ప్రో ధరను రూ.89,999గా నిర్ణయించారు. అసుస్ రోగ్ ఫోన్ 6 ధర రూ.71,999గా ఉంది. ఈ రెండు ఫోన్లలోనూ 6.78 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 6లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. అసుస్ రోగ్ ఫోన్ 6 ప్రోలో 18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65W ఫీచర్లు రెండు ఫోన్లలోనూ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ రోగ్ ఫోన్ 6, అసుస్ రోగ్ ఫోన్ 6 ప్రో సేల్‌కు రానున్నాయి.