శ్రియా 2018లో రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే విదేశాల్లో సెటిలైపోయిన శ్రియా ఇక సినిమాలు చేయదని అంతా భావించారు. తనకు పాప పుట్టేవరకు శ్రియా కొన్నాళ్లు బయట ప్రపంచానికి కనిపించలేదు. శ్రియా ఇటీవలే తన కూతురు రాధాను ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ, నటనపై ఉన్న అభిలాషను శ్రియా చంపుకోలేకపోయింది. ఇటీవల RRRలో కీలక పాత్రలో కనిపించింది శ్రియా. తాజాగా శ్రీయ తన భర్తతో కలిసి తన తండ్రి పొలానికి వెళ్లింది. అక్కడే కాసేపు పొలం పనులు చేస్తూ, కట్టెల పొయ్యిపై రోటీలు వండుతూ టైంపాస్ చేసింది. ఈ వీడియోను తాజాగా తన అభిమానులతో పంచుకుంది. శ్రీయా సింప్లిసిటీని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె భర్తను కూడా మెచ్చుకుంటున్నారు. Images and Videos Credit: Shriya Saran/Instagram