వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై100. దీని ధరను రూ.24,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ప్రారంభం కానుంది. ఆఫ్‌లైన్‌లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.38 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ ఛేంజింగ్ టెక్నాలజీతో రావడం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్, ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.