శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23 ప్లస్, ఎస్23 అల్ట్రా ఫోన్లు ఉన్నాయి. వీటి ధరను మనదేశంలో ప్రకటించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర రూ.74,999 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ ధర రూ.94,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా టాప్ ఎండ్ మోడల్‌గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధర రూ.1,24,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ మూడు ఫోన్లలోనూ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. వీటికి సంబంధించిన సేల్ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.