జియో, ఎయిర్‌టెల్ 5జీల్లో ఏది వేగవంతమైనది? ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ స్పీడ్ 900 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక జియో 5జీ వేగం కూడా దాదాపు అంతే. జియో, ఎయిర్‌టెల్ 5జీలు రెండూ దాదాపు 50 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. జియో 5జీని ఎంజాయ్ చేయాలంటే కనీసం రూ.239కు పైన ప్లాన్‌తో రీచార్జ్ చేయాలి. ఇక ఎయిర్‌టెల్ 5జీని రెగ్యులర్ ప్లాన్స్‌తోనే ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి జియో, ఎయిర్‌టెల్ 5జీ లాభాల్లో పెద్ద తేడాలు లేవు. ఈ రెండు సర్వీసుల రోల్ అవుట్ ప్రారంభ దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో 5జీ రావాలంటే 2023 చివరి దాకా ఆగాల్సిందే. All Images Credits: Pixabay