అవసరం అయినప్పుడు ‘Disappearing Messages’ ఫీచర్ ఉపయోగించండి.

మీ ఖాతాకు 2 స్టెప్ వెరిఫికేషన్ కచ్చితంగా ఆన్‌లో ఉంచండి.

విసిగించే అకౌంట్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.

అడ్రస్, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్లు వాట్సాప్ ద్వారా షేర్ చేయకండి.

దీంతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా షేర్ చేయకూడదు.

మీ ప్రొఫైల్ పిక్చర్ అందరికీ కనిపించేలా పెట్టకండి.

ప్రైవసీ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకోండి.

మీరు ఆన్‌లైన్‌లో ఉంటే ఎవరు చూడగలరో సెలక్ట్ చేసుకోండి.

మోసపూరితమైన లింకులపై క్లిక్ చేయకండి.

వాట్సాప్‌ను అధికారిక సోర్స్‌ల ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.