‘DND’, ‘Priority Only’ మోడ్స్ ద్వారా ఎంపిక చేసిన వారి నుంచి మాత్రమే కాల్స్ పొందవచ్చు. స్మార్ట్ లాక్ ద్వారా ఫోన్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేయవచ్చు. ఇన్‌స్టంట్ హార్ట్ రేట్ యాప్ ద్వారా మీ గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కించవచ్చు. స్క్రీన్ మ్యాగ్నిఫయర్ ఫీచర్ ద్వారా టెక్స్ట్, ఇమేజ్ సైజును పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫోన్ ఎవరైనా అడిగినపుడు గెస్ట్ మోడ్ యాక్టివేట్ చేసి ఇస్తే గ్యాలరీ, యాప్స్‌ను యాక్సెస్ చేయలేరు. వేరే డివైసెస్ నుంచి క్రోమ్ ట్యాబ్స్ యాక్సెస్ చేయవచ్చు. ‘కలర్ ఇన్వర్షన్’ ఫీచర్ ద్వారా ఫోన్ చూసేటప్పుడు కళ్లపై భారం పడకుండా చేయవచ్చు. మల్టీ టాస్కింగ్ కోసం స్ప్లిట్ స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. వన్ హ్యాండెడ్ మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు.