4జీ అంటే ఫోర్త్ జనరేషన్. 5జీ అంటే ఫిఫ్త్ జనరేషన్. 4జీ గరిష్ట అప్‌లోడ్ స్పీడ్ 500 ఎంబీపీఎస్. 5జీ గరిష్ట అప్‌లోడ్ స్పీడ్ 1.25 జీబీపీఎస్. 5జీ డౌన్‌లోడ్ స్పీడ్ 4జీ కంటే 10 రెట్లు అధికంగా ఉంటుంది. 4జీ నెట్‌వర్క్ లేటెన్సీ రేట్ 50 ఎంఎస్ కాగా, 5జీ నెట్‌వర్క్ లేటెన్సీ రేట్ 1 ఎంఎస్ మాత్రమే. అయితే ప్రస్తుతానికి 4జీ కవరేజీ, 5జీ కంటే మెరుగ్గా ఉంది. నెట్‌వర్క్ స్లైసింగ్ 5జీలో మాత్రమే సాధ్యం. 4జీలో ఆ ఆప్షన్ లేదు. 5జీ నెట్‌వర్క్ ఎక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటుంది. 4జీ ప్రస్తుతం దేశం అంతటా అందుబాటులో ఉంది. 5జీ 12 నగరాల్లో మాత్రమే ఉంది. హెల్త్ కేర్, రోబోటిక్స్ వంటి కమర్షయిల్ యూసేజ్‌లో 5జీ ఎక్కువగా ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి 4జీ టారిఫ్‌లతోనే 5జీని ఎంజాయ్ చేయవచ్చు.