ఎయిర్‌టెల్, జియో తలో 12 నగరాల్లో 5జీ సేవలను అందిస్తున్నాయి. వీటి 5జీ సేవలను అందుకోవాలంటే మీ స్మార్ట్ ఫోన్ అందించే అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. 5జీ సేవలకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో డేటా చాలా వేగంగా అయిపోయే అవకాశం ఉంటుంది. 5జీ నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండటం వల్ల డేటా త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది. 5జీ స్పీడ్ టెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డేటాను ఎక్కువగా తినేసే అవకాశం ఉంటుంది. యాప్స్‌కు డేటా కనెక్షన్ లిమిట్ సెట్ చేయడం ద్వారా డేటాను సేవ్ చేయవచ్చు. 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి సమయం పట్టవచ్చు. ఒక్కసారి మొత్తంగా అందుబాటులోకి వచ్చాక 5జీ రీచార్జ్ ప్లాన్ల ఖరీదు ఎక్కువ ఉండవచ్చు.