వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు సోమవారం చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో మొబైల్స్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లూ 100x జూమ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు పని చేయనున్నాయి. వివో ఎక్స్100 స్మార్ట్ ఫోన్ ధర 3,999 యువాన్ల (సుమారు రూ.45,600) నుంచి ప్రారంభం కానుంది. వివో ఎక్స్100 ప్రో ధర 4,999 యువాన్ల నుంచి (సుమారు రూ.57,100) ప్రారంభం అవుతుంది. ఈ రెండు ఫోన్లనూ బ్లాక్, ఆరెంజ్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్100లో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. వివో ఎక్స్100 ప్రోలో 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.