రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌తో 5జీ ఇంటర్నెట్‌తో పాటు స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ రూ.99కే లభించనుంది. దీని కింద ఎన్నో ఫుడ్ డెలివరీ లాభాలు లభించనున్నాయి. జియో ఈ ప్లాన్ ధరను రూ.866గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌తో జియో 5జీ వెల్‌కం ఆఫర్ కింద 90 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభించనుంది. వెల్‌కం ఆఫర్ లేని యూజర్లకు 168 జీబీ డేటా అందించనున్నారు. ఇంటర్నెట్ ఫెసిలిటీ కాకుండా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి. కాల్స్, ఎస్ఎంఎస్‌లకు 84 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. జియో త్వరలో మనదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను కూడా లాంచ్ చేయనుంది.