విష్ణు ప్రియ బ్యాక్ ఫ్లిప్ - అదిరిపోయిందిగా! బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ, 'పోవే పోరా' షోతో యాంకర్ గా మారింది. ఈ షో తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలతో ఆడియన్స్ కి దగ్గరైంది. ఈమధ్య సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్లు, డాన్స్ వీడియోలతో ఆకట్టుకుంటుంది. 'జరీ జ పంచె కట్టి', 'గంగులు' వంటి పలు ఆల్బమ్ సాంగ్స్ తో మరింత పాపులర్ అయ్యింది. విష్ణు ప్రియ బ్యాక్ ఫ్లిప్ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని పై మీరూ ఓ లుక్కేయండి. Phpto Credit : Vishnupriyaa bhimeneni/Instagram