బ్లాక్ డ్రెస్‌లో ముద్దు ముద్దుగా మంజూష - ఈ వీడియో చూశారా! ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మంజూష. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మంజూష, ఆ తర్వాత ఫుల్ టైం టీవీ యాంకర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. 2006లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో చెల్లి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 'రాఖీ' లో ఎన్టీఆర్ కి చెల్లిగా గాయత్రీ పాత్రతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ప్రస్తుతం సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ తో పాటు పలు చిన్న సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తోంది. మంజూష తాజాగా తన సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది. దాని పై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Rampalli Manjusha/Instagram