అనసూయను ‘ఆంటీ’ అనేసిన విష్ణు ప్రియ, ఏం జరుగుతాదో ఏమో! ఇంగ్లీష్ భాషలో అనసూయకు నచ్చని పదం ‘ఆంటీ’. ‘ఆంటీ’ పదాన్ని ఏజ్ షేమింగ్‌గా అనసూయ భావిస్తోంది. వయస్సును బట్టి ఆ పదాన్ని వాడాలని ఆమె సూచిస్తోంది. కానీ, ఈ పాడు ప్రపంచం ఆమె వాదనను పట్టించుకోవడం లేదు. ‘ఆంటీ’ అంటే కేసుపెడతానన్న అనసూయను బాగా ట్రోల్ చేశారు. ఏదో ముక్కుముఖం తెలియనివారు కాబట్టి అలా అనేసి ఉంటారు. కానీ, విష్ణుప్రియే స్వయంగా అనసూయపై ‘ఆంటీ’ పంచ్ వేయడం చర్చనీయమైంది. ఆర్జే కాజల్ ఇంటర్వ్యులో విష్ణు ప్రియ పరోక్షంగా అనసూయను ఆంటీ అనేసింది. ‘ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు’ అనే ప్రశ్నకు.. విష్ణు ‘అనసూయ’ అనేసి నాలుక కరుచుకుంది. మరి, ఈ విషయం అనసూయకు తెలిస్తే విష్ణు పరిస్థితి ఏమిటో! Images & Videos Credit: Anasuya, Vishnu Priya/Instagram