జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోవాటెల్ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర పవన్ కు నోటీసులు అందజేశారు. పోలీస్ యాక్ట్, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు విశాఖ గర్జన ర్యాలీకి హాజరై తిరిగి వెళ్తోన్న మంత్రులు, పోలీసులపై జనసేన కార్యకర్తలు దాడికి చేశారని తెలిపారు అక్టోబర్ 31వ తేదీ వరకూ నగరంలో ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు అనుమతి లేదని తెలిపారు. జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా ఆంక్షలు విధించి నోటీసులు అందజేశారు. నేను నోటీసులు తీసుకున్నాను. ఋషికొండ దోపిడీని డ్రోన్ ద్వారా చూపిస్తామని డ్రోనులు నిషేధించారు. ఏ పార్టీ కూడా మరో పార్టీని ఎదగడానికి ఒప్పుకోదు. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. క్రిమినల్ పాలసీతో వైసీపీ పాలన సాగుతోందన్న జనసేనాని అరెస్ట్ చేసిన మా వాళ్లను విడుదల చేసే వరకూ విశాఖలో ఉంటానన్న పవన్