పాము కనిపించగానే పాము పాము అంటూ పరుగులు పెడతాం. కానీ స్నేక్ క్యాచర్ స్నానం చేయించాడు కొందరు మాత్రం పాము కనిపించినా ధైర్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకుంటారు. అయితే విశాఖపట్నంలో వింత ఘటన చోటు చేసుకుంది. స్నేక్ క్యాచర్ ఓ పాముకు స్నానం చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పాము కనిపించిందని తెలియడంతో అక్కడకు వెళ్లిన స్నేక్ క్యాచర్ కిరణ్ పామును పట్టుకున్నాడు కానీ పాముకు బాగా బురద బాగా అంటుకుని, అది కూడా ఎండిపోయి ఉంది. స్నేక్ క్యాచర్ కిరణ్ ఆ పాముకు శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అందజేశాడు. అది ర్యాట్ స్నేక్ అని, విషం ఉండదు కానీ పొడవుగా ఉంటుందని స్నేక్ క్యాచర్ తెలిపాడు పాముకు స్నానం చేయించడం ఏంటా స్థానికులు వింతగా చూశారు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది