భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20వ తేదీకి ప్రత్యేక స్థానం ఉంది. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ అదే రోజు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కోహ్లీ టెస్టుల్లో గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా విరాట్ ఒక ట్వీట్ చేశాడు. ‘టెస్టు క్రికెట్‌లో నాకు 12 సంవత్సరాలు నిండాయి. ఫరెవర్ గ్రేట్‌ఫుల్’ అని క్యాప్షన్ పెట్టాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్‌కు ఇది మినీ హార్ట్ ఎటాక్ ఇచ్చింది. ఇది రిటైర్‌మెంట్ పోస్ట్ అని వారు భయపడుతున్నారు. కోహ్లీ గతంలోనే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా వ్యవహరించడం లేదు.