మీర్పూర్‌ టెస్టులో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది.

తొలిరోజు ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను 73.5 ఓవర్లకు 227 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ చెరో నాలుగు వికెట్లతో టైగర్స్‌ నడ్డి విరిచారు.

జయదేవ్‌ ఉనద్కత్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

బంగ్లా బ్యాటర్లలో మోమినల్‌ హఖ్‌ (84) ఒక్కడే హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.

కేఎల్‌ రాహుల్‌ (3 బ్యాటింగ్‌; 30 బంతుల్లో), శుభ్‌మన్‌ గిల్‌ (14 బ్యాటింగ్‌; 20 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం టీమ్‌ఇండియా 208 పరుగుల లోటుతో ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
(All Images Credits: BCCI)