భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.



మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది.



అనంతరం బంగ్లాదేశ్ 46 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.



అన్నిటి కంటే బాధాకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది.



మెహదీ హసన్ మిరాజ్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (10 నాటౌట్) బంగ్లాదేశ్‌ను గెలిపించారు.



వీరు చివరి వికెట్‌కు 41 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు జోడించారు.



ఒక టెయిలెండర్ వికెట్‌ను భారత బౌలర్లు తీయలేకపోవడం అవమానకరం.



భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (73: 70 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.



బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు తీశాడు.



మెహదీ హసన్ మిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.