అప్పుడెప్పుడో ఈడెన్‌ గార్డెన్స్‌లో గులాబి బంతితో ఈడెన్‌ గార్డెన్స్‌లో విరాట్ కోహ్లీ 70వ సెంచరీ చేశాడు.

మరో సెంచరీ కోసం 1021 రోజులు..! 84 ఇన్నింగ్సులు..! మూడేళ్లు..! ఎదురు చూశాడు.

చివరికి అఫ్గానిస్థాన్ పై అభిమానులు కోరికను తీర్చాడు.

61 బంతుల్లో 12 బౌండరీలు, 6 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు.

హాఫ్‌ సెంచరీకి 32 బంతులు తీసుకుంటే తర్వాత 50కి జస్ట్‌ 17 బాల్సే తీసుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ తొలి శతకం ఇదే.

సెంచరీ చేయడం తనకే షాక్ కలిగించిందని అన్నాడు.

'అనుష్క వల్లే నేనిలా ఉన్నా. ఆమె అన్నీ చూసుకుంటుంది. ఈ శతకం ఆమెకు, మా తనయ వామికకు అంకితం' అని కోహ్లీ అన్నాడు.

అత్యధిక సెంచరీలు చేసిన వారిలో పాంటింగ్తో కలిసి విరాట్ 2వ స్థానంలో ఉన్నాడు.

ఆరు వారాల విరామంలో తిరిగి ఉత్తేజం పొందానని విరాట్ అన్నాడు.