టీ20 ఫార్మాట్లో రిషభ్ పంత్‌ వైఫల్యం కంటిన్యూ అవుతోంది

తనపై పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీలంక మ్యాచులో నిలబెట్టుకోలేదు

నిజానికి పాక్‌పై లీగ్‌ మ్యాచులో పంత్‌ను ఎంపిక చేయలేదు

జడ్డూ గాయం వల్ల సూపర్‌-4లో సమీకరణాలు మారాయి.

లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడంతో డీకే బదులు పంత్‌ను తీసుకున్నారు.

పాక్‌ మ్యాచులో అతడు 12 బంతుల్లో 14 రన్స్‌ చేశాడు.

లెగ్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్విచ్‌ హిట్‌తో ఔటయ్యాడు.

కీలకమైన లంకపై 13 బంతుల్లో 17 కొట్టాడు.

టెస్టులు, వన్డేల్లో పంత్‌ అదరగొడుతున్నాడు.

టీ20ల్లో మాత్రం 57 మ్యాచుల్లో 25 కన్నా తక్కువ సగటుతో 914 రన్సే చేశాడు.