సురేశ్ రైనా ఏకధాటిగా 132 ఐపీఎల్‌ మ్యాచులు ఆడాడు. ఈ రికార్డు ఇంకెవ్వరికీ లేదు.

ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడు. 39 చేశాడు. ఓ సెంచరీ ఉంది.

2014 క్వాలిఫయర్‌లో పంజాబ్‌పై పవర్‌ప్లేలో రైనా 87 కొట్టాడు. పవర్‌ప్లేలో ఆ బ్యాటర్‌ అత్యధిక రన్స్‌ ఇవే.

సీఎస్‌కేలో 33.98 సగటుతో అత్యధిక పరుగులు 5369 చేసిన ఏకైక ఆటగాడు రైనా.

ఎంఎస్‌ ధోనీ తర్వాత సీఎస్‌కే ఎక్కువ సిక్సర్లు రైనావే. 203 కొట్టాడు.

ఐపీఎల్‌లో రైనా 109 క్యాచులు పట్టాడు. నాన్‌ వికెట్‌ కీపర్‌ పట్టిన అత్యధిక క్యాచులివే.

ఐపీఎల్‌లో మూడో స్థానంలో ఎక్కువ రన్స్‌ చేసిన ఆటగాడు రైనానే.

ఐపీఎల్‌లో తొలుత 5000 రన్స్‌ చేసిన ఘనత రైనాదే.

లీగులో వరుసగా 7 సీజన్లలో 400+ రన్స్‌ కొట్టాడు. ఇలాంటి నిలకడ మరెవ్వరికీ లేదు.

చెన్నై తరఫున అత్యధిక బౌండరీలు (425) కొట్టింది రైనానే.