ఇది విరాట్‌కు 46వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ (49)కు కేవలం మూడు అడుగుల దూరంలోనే ఉన్నాడు.

ఓపెనింగ్ రాకుండా ఐదు సార్లు 150 మార్కును దాటిన ఏకైక భారతీయ బ్యాటర్ విరాట్ కోహ్లీనే.

జనవరి 15న కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించాడు. 2017, 18, 19ల్లో మూడు వచ్చాయి. ఇది నాలుగోది.

సొంత గడ్డపై విరాట్ 22 శతకాలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ (20) కంటే ఇది ఎక్కువ.

శ్రీలంకపై విరాట్‌కు ఇది పదో సెంచరీ. ఒక జట్టుపై ఏ బ్యాటర్‌కైనా ఇదే అత్యధిక శతకాల సంఖ్య.

అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక బ్యాటర్ జయవర్ధనేని వెనక్కి నెట్టాడు.

ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో విరాట్‌వే అత్యధిక సెంచరీలు.

వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో విరాట్‌కి ఇవే (8) అత్యధిక సిక్సర్లు.

విరాట్ వన్డే కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్ (166 నాటౌట్) రెండో అత్యధిక స్కోరు. మొదటి హయ్యస్ట్ 183.

ఈ సెంచరీతో విరాట్ 74 అంతర్జాతీయ సెంచరీలను చేరుకున్నాడు.