సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ నుంచి త్వరలో రిటైర్ కానుందని తెలుస్తోంది.



దుబాయ్ డ్యూటీ టెన్నిస్ చాంపియన్ షిప్పే తన చివరి టోర్నీ కానుంది.



ఈ టోర్నీ వచ్చే నెలలో జరగనుంది.



నిజానికి గతేడాది యూఎస్ ఓపెన్ తర్వాతనే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాల్సింది.



కానీ గాయం కారణంగా ఆ టోర్నీలో ఆడలేదు.



టెన్నిస్ కోర్టులో సానియా ఎన్నో రికార్డులు సాధించింది.



ఇప్పటి వరకు సానియా ఆరు పెద్ద చాంపియన్ షిప్‌లను సాధించింది.



వాటిలో మూడు డబుల్స్ కాగా, మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్.



పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా వివాహం చేసుకుంది.
(Image Credits: Instagram)