న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా రెడీ! హ్యామిల్టన్‌లో ఆదివారం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. గబ్బర్ సేన ఈ సిరీసులో నిలవాలంటే రెండో వన్డేలో కచ్చితంగా గెలవాలి. లేదంటే సిరీస్ కివీస్‌కే. బ్యాటింగ్ పరంగా టీమ్‌ఇండియాకు ఇబ్బందులేం లేవ్! శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ శుభారంభాలే ఇస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ అవకాశాన్నీ ఒడిసిపడుతున్నాడు. సూర్యకుమార్ ఆట తెలిసిందే. సంజూ శాంసన్ ఓకే. ఇంటెంట్ మిస్సైందో ఇంకేదైనా ప్రాబ్లమో రిషభ్ పంత్ బాగా ఆడటం లేదు. అతడి నుంచి ఆశించేది ఒకటైతే ఔట్‌పుట్ మరోటి వస్తోంది. తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ తన దూకుడైన బ్యాటింగ్తో అదరగొట్టాడు. బౌలింగ్ బాగుంది. వికెట్లు తీయడంలో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతోంది. కొన్ని మ్యాచుల్లో బాగా రాణిస్తున్న బౌలర్లు కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్నారు. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ ఫర్వాలేదు. శార్దూల్ ఇంకా రాణించాలి. దీపక్ చాహరుకు ఛాన్స్ ఇవ్వొచ్చు. యూజీ వికెట్లు తీయాలి. షాబాజ్ నదీమ్ బెటర్ ఆప్షనే. కివీస్ టాప్ ఆర్డర్ ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే ఫర్వాలేదు. డరైల్ మిచెల్ బాదగలడు. కేన్ ఫామ్లోకి వచ్చాడు. టామ్ లేథమ్ భీకరంగా ఆడాడు. వీరిని అడ్డుకోవడం ఇంపార్టెంట్. టిమ్ సౌథీ, ఫెర్గూసన్ రన్స్ ఇవ్వకుండా వికెట్లు తీస్తున్నారు. మ్యాట్ హెన్రీ, మిల్న్ వీరికి తోడుగా ఉన్నారు. శాంట్నర్ స్పిన్‌తో రాణిస్తున్నాడు.