ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత భారత్‌ తొలి సిరీస్‌ కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీసును 1-0తో కైవసం చేసుకుంది.

ఈ సిరీస్‌ సాంతం వరుణుడు ఇబ్బందులు కలిగించాడు. వర్షంతో తొలి మ్యాచ్‌ రద్దవ్వగా ..

రెండో దాంట్లో టీమ్‌ఇండియా గెలిచింది. ఇక మంగళవారం జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది.

161 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లకు టీమ్‌ఇండియా 75/4తో ముగిసింది. అప్పుడే వర్షం రావడంతో ఆట నిలిచింది.

డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం స్కోరు సమమైంది. ఎంతకీ వరుణుడు కరుణించకపోవడంతో ఫలితం టైగా మారింది.

హార్దిక్‌ పాండ్య (30*; 18 బంతుల్లో 3x4, 1x6) దూకుడుగా ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ (10), రిషభ్ పంత్‌ (11) సూర్యకుమార్‌ (13) ఫర్వాలేదనిపించారు. శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్‌ అయ్యాడు.

కివీస్‌లో డేవాన్‌ కాన్వే (59; 49 బంతుల్లో 5x4, 2x6), గ్లెన్ ఫిలిప్స్‌ (54; 33 బంతుల్లో 5x4, 3x6) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

సిరాజ్, అర్షదీప్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

రెండో మ్యాచులో సెంచరీ వీరుడు సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పట్టేశాడు.