విండీస్ బిగ్‌మ్యాన్ కీరన్ పొలార్డ్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించాడు.
2010 నుంచి పోలీ ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు
13 సీజన్ల పాటు అభిమానుల్ని అలరించాడు.
భారీ షాట్లు కొట్టడం, బౌలర్‌ను భయపెట్టడం అతడి శైలి.
తన మీడియం పేస్‌తో వికెట్లు తీస్తూ ముంబయి విజయాల్లో కీలకంగా నిలిచాడు.
పొలార్డ్ 189 మ్యాచుల్లో 3412 రన్స్ చేశాడు. సగటు 28, అత్యధిక స్కోరు 87 నాటౌట్
2013 బెస్ట్ సీజన్. 42 సగటు, 150 స్ట్రైక్‌రేట్‌తో 281 రన్స్ చేశాడు.
ఐపీఎల్‌లో 69 వికెట్లు పడగొట్టాడు. 4/44 బెస్ట్ బౌలింగ్.
'ఇది కఠిన నిర్ణయం. ఇంకొన్నేళ్లు ఆడగలను కానీ ఇప్పుడు ముంబయి పరివర్తన చెందుతోంది. మరో జట్టుకు ఆడలేను. ఐపీఎల్‌లో బెస్ట్ టీమ్‌కు ఆడినందుకు సంతోషం' అని పొలార్డ్ అన్నాడు.