ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 ఆఖరి ఘట్టానికి చేరుకుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 ఆఖరి ఘట్టానికి చేరుకుంది.

సెమీస్‌ విజేతలు ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ ఫైనల్లో తలపడుతున్నాయి.

మెల్‌బోర్న్‌ మైదానం ఇందుకు వేదిక. మధ్యాహ్నం 1:30 మ్యాచ్‌ ఆరంభం.

టీ20 మెగా టోర్నీల్లో పాక్‌, ఇంగ్లాండ్‌ 2009, 2010లో ఢీకొన్నాయి. రెండుసార్లూ ఇంగ్లాండే విజేత.

సూపర్‌ 12లో తడబడ్డ బట్లర్‌ సేన ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉంది. హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, మంచి బౌలర్లు ఉన్నారు.

బట్లర్‌, అలెక్స్ హేల్స్‌లో ఒక్కరు నిలిచినా రన్స్‌ ఫెస్టే! మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్‌, మొయిన్‌, మలన్‌, స్టోక్స్‌, కరన్‌ కీలకం.

మార్క్‌వుడ్‌ లేకున్నా జోర్డాన్‌ ఉన్నాడు. స్టోక్స్‌, కరన్‌, వోక్స్‌ పేస్‌ వేస్తారు. రషీద్‌, లివింగ్‌స్టోన్‌ స్పిన్‌ వేస్తారు.

పాక్‌లో ఓపెనర్లు బాబర్‌ ఆజామ్‌, రిజ్వాన్‌ ఫామ్‌లో ఉన్నారు. వన్‌డౌన్‌లో హ్యారిస్‌, మిడిల్‌లో మసూద్‌, ఇఫ్తికార్‌, నవాజ్‌ కీలకం.

అఫ్రిది, నసీమ్‌, రౌఫ్, వసీమ్‌ పేస్‌కు తిరుగులేదు. షాదాబ్‌, నవాజ్‌ స్పిన్‌తో డేంజరే! అంతా ఆడితే పాక్‌ సూపర్‌.

MCG బౌండరీలు పెద్దవి. 160ని డిఫెండ్‌ చేసుకోవచ్చు. వర్షం వస్తే బౌలింగ్ టఫ్‌గా ఉంటుంది. మ్యాచ్‌ జరిగే ఛాన్స్‌ తక్కువ.