పాకిస్థాన్ మరోసారి అద్భుతం చేసింది!

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 ఫైనల్‌కు దూసుకెళ్లింది.

టోర్నీలోనే అత్యుత్తమంగా ఆడిన న్యూజిలాండ్‌ను వణికించింది.

కివీస్ ఇచ్చిన 153 టార్గెట్ ను 19.1 ఓవర్లకే 7 వికెట్లతో ఛేదించింది.

పాక్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజామ్‌ (53; 42 బంతుల్లో 7x4), మహ్మద్‌ రిజ్వాన్‌ (57; 43 బంతుల్లో 7x4) బౌలర్లకు చుక్కలు చూపించారు.

కేన్‌ విలియమ్సన్‌కు వారినెలా అడ్డుకోవాలో అర్థమేకాలేదు.

కివీస్‌లో డరైల్‌ మిచెల్‌ (53*; 35 బంతుల్లో 3x4, 1x6), కేన్‌ విలియమ్సన్‌ (46; 42 బంతుల్లో 1x4, 1x6) రాణించారు.

ఆరంభ ఓవర్‌ నుంచే బాబర్, రిజ్వాన్ బంతిని చితకబాదడం మొదలుపెట్టారు.

షాహిన్ అఫ్రిదీ సహా పాక్ బౌలర్లు కివీసును కట్టడి చేశారు.

క్యాచులు, రనౌట్లు మిస్ చేయడం, కేన్ కెప్టెన్సీ తప్పిదాలు కివీస్ ఓటమికి కారణాలు.