హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అదరగొట్టాడు.

న్యూజిలాండ్‌ సిరీసులో మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు.

రెండో టీ20లో 2 వికెట్లు తీయగా మూడో మ్యాచులో 4 తీశాడు.

మూడో టీ20లో 17 రన్స్‌ ఇచ్చి 4.25 ఎకానమీతో చాప్‌మన్‌, ఫిలిప్స్‌, నీషమ్‌, శాంటర్న్‌ను ఔట్‌ చేశాడు.

పురుషుల టీ20ల్లో న్యూజిలాండ్‌ ఓ భారత పేసర్‌ అత్యుత్తమ గణాంకాలు సిరాజ్‌వే.

పంజాబ్‌ 'కింగ్‌' అర్షదీప్‌ సింగ్‌ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.

మూడో టీ20లో 9.25 ఎకానమీతో 4 వికెట్లు తీశాడు.

ఫిన్‌ అలెన్‌, డేవాన్‌ కాన్వే, డరైల్‌ మిచెల్‌, ఇష్‌ సోధిని అర్షదీప్‌ ఔట్‌ చేశాడు.

అర్షదీప్‌, సిరాజ్‌ కలిసి 8 వికెట్లు, హర్షల్‌ 1 పడగొట్టారు. ఒకరు రనౌట్‌ అయ్యారు.

మూడో టీ20లో సిరాజ్‌, అర్షదీప్‌ కలిసి 149 వద్ద నలుగుర్ని పెవిలియన్‌ పంపారు.