యువ కెరటం ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. 126 బంతుల్లోనే 200 స్కోరు అందుకున్నాడు. సెంచరీతో విరాట్ కోహ్లీకి అతడికి అండగా నిలిచాడు. మూడో వన్డేలో ఇషాన్ 131 బంతుల్లో 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 210 రన్స్ సాధించాడు. ఒక సిక్సర్, ఏడు బౌండరీలతో 49 బంతుల్లో కిషన్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 85 బంతుల్లో సెంచరీ, 103 బంతుల్లో 150 బాదేశాడు. ముస్తాఫిజుర్ వేసిన 34.6వ బంతికి సింగిల్ తీసి ఎలైట్ కబ్ల్‌లో చేరాడు. విరాట్ తో కలిసి రెండో వికెట్‌కు 190 బంతుల్లోనే 290 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు కిషన్. కిషన్ దెబ్బకు గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ రికార్డు మరుగున పడింది. ఇషాన్ కు ముందు రోహిత్, సచిన్, సెహ్వాగ్ డబుల్ సెంచరీలు కొట్టారు. రోహిత్ 3 సార్లు 200+ సాధించాడు. ఈ ఇన్నింగ్సుతో ఇషాన్ జట్టులో స్థానం పదిలం చేసుకున్నట్టే అనిపిస్తోంది.