వన్డే ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా సన్నాహాలు మొదలెట్టింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతోంది.

మీర్పూర్‌ షేర్‌ ఏ బంగ్లా స్టేడియంలో ఆదివారం తొలి వన్డే ఆడనుంది. సీనియర్‌ ప్లేయర్స్‌ వచ్చేశారు.

2015 తర్వాత బంగ్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. బంగ్లా టైగర్స్‌తో వన్డే, టీ20 ఫార్మాట్‌ ఎప్పుడే ఇంట్రెస్టింగే.

రోహిత్‌, విరాట్‌, రాహుల్‌ టీమ్‌లోకి వచ్చేశారు. పాటిదార్‌, త్రిపాఠి, కిషన్‌, వాషింగ్టన్‌ ఉన్నారు.

రోహిత్‌, ధావన్‌ ఓపెనింగ్‌ చేస్తారు. వన్‌డౌన్‌ కోహ్లీ, తర్వాత శ్రేయస్‌, రాహుల్‌, పంత్, వాషింగ్టన్‌, అక్షర్‌ వస్తారు.

కోహ్లీ, వాషింగ్టన్‌, శ్రేయస్‌ ఫామ్‌లో ఉన్నారు. గబ్బర్‌, రాహుల్‌, పంత్‌ బెటర్‌గా ఆడాలి.

సిరాజ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, ఉమ్రాన్‌ పేస్‌ వేస్తారు. సుందర్‌, అక్షర్‌, స్పిన్‌ వేస్తారు. షాబాజ్‌ మంచి ఆప్షనే.

తస్కిన్‌ అహ్మద్‌, తమీమ్‌ ఇక్బాల్‌ అందుబాటులో లేరు. లిటన్‌ దాస్‌ బంగ్లాకు కెప్టెన్సీ చేస్తాడు. జట్టుగా బాగానే ఉంది.

బ్యాటింగ్‌లో లిటన్‌కు అన్ముల్‌, షకిబ్‌, ముష్ఫికర్‌, మహ్మదుల్లా అండగా ఉన్నారు. అఫిఫ్‌, యాసిర్‌ బ్యాటింగ్ చేయగలరు.

ముస్తాఫిజుర్‌తో డేంజర్‌. సొంతగడ్డపై ఇబాదత్‌, మెహదీ హసన్‌, షకిబ్‌ బౌలింగ్‌తో జాగ్రత్తగా ఉండాలి.