సాధారణంగా ఏనుగులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంటాయి. గుంపులు గుంపులు వచ్చి చెరుకు పంటలపై దాడి చేసి తినేసిన ఘటనలు చూశాం ఓ ఏనుగు మాత్రం ఎంచక్కా పానీపూరీలు లాగించేసిన వీడియో వైరల్ అవుతోంది అసోం రాష్ట్రం గువాహటిలో ఈ ఘటన జరిగింది. పానీ పూరీ బండి వద్దకు వచ్చి మరీ ఇష్టంగా తింటోంది ఏనుగు బండి దగ్గర వ్యక్తి సర్వ్ చేస్తుంటే లెట్స్ డు కుమ్ముడూ అంటూ ఎంజాయ్ చేస్తోంది రోడ్లపై వాహనాలు పోతుంటే విధ్వంసం చేసిన ఏనుగుల్ని చూసి ఉంటారు పార్కుల్లోకి వెళ్లి ఫొటోలు తీస్తుంటే వెంటపడి తరిమిన ఏనుగుల్ని కూడా చూశాం పానీపూరి లవర్స్ లాగే ఎంచక్కా పానీపూరీలు తింటున్న ఏనుగు వీడియో వైరల్ అయింది తరువాత వాళ్లకు మిగులుతాయా లేదా అని నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.