ట్విన్ టవర్లను కూల్చివేయాలని అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 11, 2014లో ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనలు ఉల్లంఘించడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో సూపర్‌టెక్ 100 మీటర్ల అపెక్స్, సెయాన్ టవర్‌లను ఆదివారం కూల్చివేశారు. ఎత్తైన భవనాలను కూల్చివేయడంలో నైపుణ్యం ఉన్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ టవర్స్ ను కూల్చివేసింది. రెండు టవర్‌లతో సహా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2009లో నోయిడా అథారిటీ ఆమోదించింది. అప్పటి చట్టాల ప్రకారం కచ్చితంగా ఉంది. బిల్డింగ్ ప్లాన్‌లో ఎలాంటి మార్పు జరగలేదని, పూర్తిస్థాయి అనుమతులతోనే నిర్మించామని సూపర్‌టెక్ తెలిపింది. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ.2 కోట్లు, కొనుగోలుదారులకు 12 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోయిడా జేపీ ఫ్లైఓవర్‌కు ఇరువైపులా బారికేడ్‌లు పెట్టారు. కాలుష్యాన్ని ఎదుర్కోడానికి యాంటీ స్మోగ్ గన్‌లను అందుబాటులో ఉంచారు. టవర్ల కూల్చివేత తర్వాత, ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడానికి వాటర్ ట్యాంకర్లు, మెకానికల్ స్వీపింగ్ మిషన్లు, స్వీపర్లను మోహరించారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, యూపీ సీఎస్ మిశ్రాతో పరిస్థితిని సమీక్షించి కూల్చివేతకు సాయం అందించారు. పేలుడుకు ముందు ట్విన్ టవర్‌లో, చుట్టుపక్కల ఉన్న 40 వీధికుక్కలను ఎన్‌జీఓలు నిర్వహిస్తున్న షెల్టర్‌లకు తరలించారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత వీడియో