వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న విక్రమ్, 'కెజియఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన 'కోబ్రా' విడుదలవుతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 1న 'జల్సా'ను కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' సినిమా కూడా కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా కూడా సెప్టెంబర్ 2న విడుదలవుతోంది. సెప్టెంబర్ 2న విడుదలవుతున్న మరో సినిమా 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. దీనికి 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సునీల్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బుజ్జి ఇలా రా' సినిమా కూడా సెప్టెంబర్ 2న విడుదలవుతోంది. ధృవ్ సర్జా, రచితా రామ్ జంటగా నటించిన కన్నడ సినిమా 'పుష్పరాజ్' పేరుతో తెలుగులో అనువాదమైంది. అదీ సెప్టెంబర్ 2న విడుదలవుతోంది. గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటించిన 'ఆకాశ వీధుల్లో' కూడా సెప్టెంబర్ 2న విడుదలవుతోంది. తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' విడుదల కూడా సెప్టెంబర్ 2నే. ప్రియాంక శర్మ, శివ ఆలపాటి షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ నటీనటులుగా రూపొందిన 'డై హార్డ్ ఫ్యాన్' విడుదల కూడా సెప్టెంబర్ 2నే.