కేతికా శర్మ కథానాయికగా నటించిన తాజా సినిమా 'రంగ రంగ వైభవంగా'. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్‌కు జోడీగా నటించారు. భీమవరంలో జరిగిన 'రంగ రంగ వైభవంగా' సెమీ ప్రీ రిలీజ్ వేడుకకు కేతికా శర్మ ఈ విధంగా అటెండ్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'రంగ రంగ వైభవంగా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కథానాయికగా కేతికా శర్మకు తెలుగులో మూడో సినిమా 'రంగ రంగ వైభవంగా'. దీనికి ముందు 'రొమాంటిక్', 'లక్ష్య' సినిమాలు చేశారు. కేతికా శర్మ నటించిన తొలి రెండు సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ సినిమాతో హిట్ అందుకోవాలి. 'రంగ రంగ వైభవంగా' సినిమాలో కేతికా శర్మ డాక్టర్ రోల్ చేశారు. ఆమె క్యారెక్టర్ పేరు రాధ. ఇద్దరు ఈగోయిస్టుల మధ్య ప్రేమకథే 'రంగ రంగ వైభవంగా'. రిషి, రాధ లవ్ జర్నీని వెండితెరపై చూడాలి. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ మధ్య కెమిస్ట్రీ బావుంటుందని ఆడియన్స్ అంటున్నారు. షూటింగ్ చేసేటప్పుడు తనను వైష్ణవ్ తేజ్ టీజ్ చేశారని ట్రైలర్ విడుదలలో కేతికా శర్మ సరదాగా అన్నారు.