విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన 'లైగర్' థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందో మినీ రివ్యూలో చూడండి. కథేంటి? : ఎంఎంఎ ఛాంపియన్ కావాలనేది 'లైగర్' (విజయ్ దేవరకొండ) కల. దానికి అతను ఎంత కష్టపడ్డాడు? 'లైగర్' ప్రేమించిన తాన్యా ఎవరు? ఆమె వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి? మైక్ టైసన్‌తో లైగర్ ఎందుకు ఫైట్ చేశాడు? ఎలా ఉంది? : 'లైగర్' చూశాక... ప్రేక్షకులకు గుర్తుండేది విజయ్ దేవరకొండ ప్యాక్డ్ బాడీ మాత్రమే. 'లైగర్' కోసం శారీరకంగా, మానసికంగా విజయ్ ఎంత కష్టపడ్డాడనేది స్క్రీన్ మీద కనబడుతుంది. విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, నత్తితో డైలాగులు చెప్పిన తీరు ఫ్యాన్స్‌కు నచ్చుతాయి. మైక్ టైసన్‌ను అటువంటి రోల్‌కు ఎందుకు తీసుకున్నారో అసలు! రమ్యకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. కానీ, బలమైన సన్నివేశాలు లేవు. హీరోయిన్ అనన్యా పాండే గ్లామర్ షో చేశారు. నటిగా ఏమంత ఆకట్టుకోలేదు. మిగతా వాళ్ళు పెద్దగా చేసింది ఏమీ లేదు. కథ, దర్శకత్వం విషయానికి వస్తే పూరి జగన్నాథ్ నిరాశ పరిచారు. రెగ్యులర్ & రొటీన్ స్టైల్‌లో సినిమా తీశారు. పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ లేకపోవడం మేజర్ మైనస్. స్క్రీన్ ప్లే, క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ను ఫూల్ చేశారు. సాంగ్స్, వాటి ప్లేస్‌మెంట్ బాలేదు. డబ్బింగ్ సాంగ్స్‌లా ఉన్నాయి. రీ రికార్డింగ్ కూడా సోసోగా ఉంది. సినిమాకు మ్యూజిక్ పెద్ద మైనస్. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ ఫైట్స్ ఓకే. విజయ్ దేవరకొండ వీరాభిమానులకు తప్ప మిగతా వాళ్ళకు 'లైగర్' నచ్చదు. పూరి డిజప్పాయింట్ చేశారు. 'లైగర్' కంప్లీట్ రివ్యూ, రేటింగ్ కోసం ABP Desam వెబ్ సైట్ చూడండి.