పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్'. కాస్ట్ అండ్ క్రూ, ఇతర వివరాలు తెలుసుకోండి.

ఛాయ్‌వాలా నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు వెళ్లే యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.

సినిమాకు 70 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యిందట. సుమారు 90 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు.

విజయ్ దేవరకొండ కోచ్ పాత్రలో హిందీ నటుడు రోనిత్ రాయ్ కనిపిస్తారు.

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పతాక సన్నివేశాల్లో వచ్చే కీలక పాత్ర చేశారు. హీరో తండ్రి రోల్ అని టాక్.

విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది.

పూరి సినిమా అంటే కమెడియన్ ఆలీ కంపల్సరీ. ఆయన రోల్ చేశారని తెలిసింది. ట్రైలర్‌లో మాత్రం కనిపించలేదు.

సినిమాలో విష్ణు రెడ్డి బ్యాడ్ బాయ్ రోల్ చేశారు. ఆయన 'లైగర్'కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా!

'లైగర్'లో గెటప్ శ్రీను, టెంపర్ వంశీ కీలక పాత్రలు చేశారు.

విజయ్ దేవరకొండ ఛాయ్‌వాలాగా కనిపించే సన్నివేశాల్లో మకరంద్ దేశ్‌పాండే ఉన్నారు.

'లైగర్'కు సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం అందించారు.

'లైగర్'ను హిందీలో కరణ్ జోహార్ భారీ ఎత్తున  విడుదల చేస్తున్నారు. సినిమా నిర్మాతలలో ఆయన ఒకరు. 

సినిమా నిర్మాతల్లో ఛార్మీ ఒకరు. షూటింగ్ వ్యవహారాలు ఆమె దగ్గరుండి చూసుకున్నారు. (All Images Courtesy : Liger Movie Team)