మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా... ఎవరూ టచ్ చేయలేని, ఆయనకు మాత్రమే సాధ్యమైన రేర్ మెగా రికార్డ్స్ ఏంటో ఒకసారి చూడండి



సినిమా(ఆపద్బాంధవుడు)కు రూ. 1.25 కోట్లు తీసుకున్న తొలి ఇండియన్ హీరో చిరంజీవి. 'బిగ్గెర్ దేన్ బచ్చన్' అంటూ అప్పుడు వీక్ మ్యాగజైన్ కవర్ పేజీ ప్రచురించింది.  



ఇండియాలో రూ. 7 కోట్ల పారితోషికం అందుకున్న తొలి హీరో చిరంజీవి. అప్పుడు 'లగాన్'కు ఆమిర్ ఖాన్ తీసుకున్నది రూ. 6 కోట్లే. 



ఇండియాలో తన పేరు మీద వ్యక్తిగత వెబ్‌సైట్‌ ప్రారంభించిన తొలి నటుడు చిరంజీవి



ఆస్కార్ అవార్డులకు ఆహ్వానం అందుకున్న ఫస్ట్ సౌతిండియన్ హీరో చిరంజీవి. గౌరవ అతిథిగా 1987లో ఆయన్ను అకాడమీ ఆహ్వానించింది. 



ఉత్తమ నటుడిగా ఏడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు (తెలుగు కేటగిరీలో) అందుకున్న ఏకైక దక్షిణాది నటుడు చిరంజీవి



తెలుగులో పది కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా 'ఘరానా మొగుడు'



బాక్సాఫీస్ బరిలో రూ. 30 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సినిమా 'ఇంద్ర'



ఏపీ, తెలంగాణలో వంద రోజులు ఆడిన 47 సినిమాలు ఉన్న ఏకైక తెలుగు హీరో చిరంజీవి



ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు - 8 ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో చిరంజీవి. 



మెగాస్టార్ చిరంజీవికి ABP Desam తరఫున జన్మదిన శుభాకాంక్షలు