పూరి జగన్నాథ్ డైలాగ్స్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి, 'లైగర్'లో విజయ్ దేవరకొండకు ఎలాంటి డైలాగ్స్ రాశారు? చూడండి. నువ్వు గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. నువ్వు కిస్ ఇస్తే లిప్ కిస్ ఇస్తా - విజయ్ దేవరకొండ ఒక ఫైటర్‌కి పుట్టిన, ఇంకో ఫైటర్‌తో పెరిగినా! ఐయామ్ ఎ ఫైటర్ - విజయ్ దేవరకొండ అబ్బాయిలకు నరకం చూపించడానికి దేవుడు ముద్దుగా చేసుకున్న బొమ్మలు అమ్మాయిలు - విజయ్ దేవరకొండ పోరీ లు (అమ్మాయిలు) పోరీల్లా (అమ్మాయిల్లా) ఉండాలి... ఇట్లా ఉంటే మీకు పెళ్ళిళ్ళు కావు - అమెరికాలో లేడీస్‌తో ఫైట్ చేసేటప్పుడు విజయ్ దేవరకొండ కంట్లో కారం కొడతా! కింద కారం పెడతా - ఇంట్రడక్షన్ సీన్‌లో రమ్యకృష్ణ నా బిడ్డ టైగర్ కాదు... లైగర్. క్రాస్ బ్రీడ్ సార్. మా ఆయన లయన్, నేను టైగర్ - రోనిత్ రాయ్‌తో రమ్యకృష్ణ నీకంటే పెద్ద హీరో ఎవడున్నాడు? - ఒక ఫైట్ సీన్ తర్వాత విజయ్ దేవరకొండతో అనన్యా పాండే అమ్మా నాన్నా పేరు మాత్రమే పెడతారు. దాన్ని కొడుకే నిలబెట్టుకోవాలి - రోనిత్ రాయ్ ఆవేశాన్ని ఆపుకోవడం గొప్ప - ఒక సన్నివేశంలో విజయ్ దేవరకొండతో రోనిత్ రాయ్ ఇంతకు ముందు సినిమాల్లో రాసిన పంచ్ డైలాగ్స్ స్థాయిలో 'లైగర్'లో పూరి జగన్నాథ్ డైలాగ్స్ రాయలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.